Studio18 News - తెలంగాణ / : బీఆర్ఎస్ కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంగుల కమలాకర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి గుంగుల నర్సమ్మ ఈ ఉదయం కన్నుమూశారు. నర్సమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు గంగుల కమలాకర్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.
Admin
Studio18 News