Studio18 News - TELANGANA / : Ration Cards : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ సబ్ కమిటీ రేషన్ కార్డుల జారీకి విధివిధానాలు రూపొందించనుంది. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడిగా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. మరోవైపు క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. అటు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ క్యాబినెట్ శుభవార్త చెప్పింది. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో హుస్నాబాద్ రైతాంగం చిరకాల స్వప్నం నెరవేరనుంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గౌరవెల్లి ప్రాజెక్ట్ పెండింగ్ పనుల పూర్తి కోసం రూ.437 కోట్లు విడుదలకి క్యాబినెట్ ఆమోదించింది. మంత్రివర్గం నిర్ణయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సహచర క్యాబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు పొన్నం ప్రభాకర్.
Admin
Studio18 News