Studio18 News - TELANGANA / : తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి వేడుకలను రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ స్తూపం వద్ద మండల యాదవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటానికి శ్రీకారం చుట్టి అమరుడయ్యాడని, ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ సాయుధ పోరాటం ఉవ్వేత్తున ఎగిసిందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు తొలి తెలంగాణ అమరుడు సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి రక్తపు చుక్క దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, ప్రజాబంధు పార్టీ జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం, యాదవ నాయకులు గోగు లింగం యాదవ్, పెద్దవేని వెంకట్ యాదవ్, దోమకొండ కృష్ణ కాంత్ యాదవ్, గొడుగు దేవయ్య యాదవ్, అగ్గతి రాజు యాదవ్, బొంగు మల్లేశం యాదవ్, గుడి కాడి శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : nagarkurnool : మాదక ద్రవ్యాలపై పటిష్ట నిఘా
ADVT
Admin
Studio18 News