Studio18 News - తెలంగాణ / : తెలంగాణలోని కరెంట్ కోతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో విద్యుత్ కోసం ఇలాంటి నిరసనలు చూసి యుగాలు అయిందని... మార్పు మహత్యం ఇదేనంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ నిరసనకు సంబంధించిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. తమకు కరెంట్ రావడం లేదంటూ నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం చేగుంట గ్రామంలో రైతులు సబ్ స్టేషన్‌కు తాళం వేసి ధర్నాకు దిగారు. తమ గ్రామానికి, వ్యవసాయానికి కరెంట్ సరిగ్గా రావడం లేదని రైతులు మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిని రీట్వీట్ చేస్తూ కేటీఆర్ కరెంట్ కోతలపై చురకలు అంటించారు.
Admin
Studio18 News