Saturday, 22 March 2025 08:07:52 AM
# NPCI: ఇనాక్టివ్ ఫోన్ నెంబర్లకు యూపీఐ సేవల నిలిపివేత # Honey Trap: కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆరు నెలల పాటు సస్పెన్షన్ వేటు # Posani Krishna Murali: పోసానికి ఊరట... సీఐడీ కేసులో బెయిల్ మంజూరు # Rajitha Mother : టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి తల్లి కన్నుమూత.. # తిరుమలలో చంద్రబాబు సంచలన ప్రకటన.. వారికిచ్చిన 35 ఎకరాలు క్యాన్సిల్.. # Tirumala: నారా దేవాన్ష్​లా మీరూ టీటీడీ అన్నప్రసాదం ట్ర‌స్టుకు విరాళం ఇవ్వొచ్చు.. దేనికి ఎంత ఖర్చు అవుతుందంటే? # Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు.. సోషల్ మీడియాలో హెచ్చరించిన మెగాస్టార్.. # Tech Tips in Telugu : వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కడానికి అసలు కారణాలివే.. ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. బ్యాటరీ సేవింగ్ స్మార్ట్ టిప్స్..! # IPL 2025: కొత్తగా మూడు రూల్స్‌ తీసుకొచ్చిన బీసీసీఐ.. అవేంటంటే? # Telangana : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి.. # Chiranjeevi : పీఎం మోదీ ఆ రోజు నాతో ఏం మాట్లాడారంటే.. కన్నీళ్లు వచ్చాయంటూ.. చిరు వ్యాఖ్యలు వైరల్.. # పర్ఫార్మెన్స్, డిజైన్ రెండింటిలోనూ అద్భుతంగా ఉంటుందని స్మార్ట్‌ప్రిక్స్ రిపోర్టు తెలిపింది. ఐక్యూ Z10 సిరీస్‌లో Pro, Z10x వేరియంట్ కూడా ఉంటుందని గతంలో # Telangana Assembly: సై అంటే సై.. అసెంబ్లీలో రగడ.. హరీశ్ రావు వర్సెస్ కోమటిరెడ్డి.. # Gold Price: రాబోయే మూడు నెలల్లో బంగారం ధరలు ఎంతగా పెరుగుతాయో తెలుసా? # MG Comet EV 2025 : కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు రేంజే వేరబ్బా.. సింగిల్ ఛార్జ్‌తో 230కి.మీ దూసుకెళ్తుంది..! # Gold: బాబోయ్.. బంగారం రికార్డులే రికార్డులు.. ఆశ్చర్యపరుస్తున్న డబ్ల్యూజీసీ తాజా గణాంకాలు.. 2025 చివరి నాటికి.. # Tata Car Prices : కొత్త కారు కావాలా? ఏప్రిల్‌లో భారీగా పెరగనున్న టాటా PV, EV కార్ల ధరలు.. ఇప్పుడు కొంటేనే బెటర్..! # Mahesh Babu – Sitara : మహేష్ బాబుకే నేర్పిస్తున్న కూతురు సితార.. జెన్ జీ అంటే అట్లుంటది మరి.. వీడియో వైరల్.. # McDonald’s: గుడ్‌న్యూస్‌.. తెలంగాణ నుంచి ఇవి కొనేందుకు మెక్‌డొనాల్డ్స్‌ రెడీ.. ఇక మనవాళ్లకి లాభాలు.. # Affordable SUV Cars : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.10లక్షల లోపు SUV కార్లు.. టాప్ 5 మోడల్స్ ఇవే..!

ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదలు.. హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన

Date : 03 September 2024 11:41 AM Views : 62

Studio18 News - TELANGANA / : CM Revanth Reddy : ఖమ్మంలో ఆక్రమణల వల్లనే వదరలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో మున్నేరు వరద ముంపుకు గురైన ప్రాంతాలను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. రాత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసంలో బసచేశారు. ఇవాళ ఉదయం ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. ఖమ్మంలో వరదలకు కారణం ఆక్రమణలేనని అన్నారు. గతంలో గొలుసు కట్టు చెరువులు ఉండేవన్నారు. మున్నేరు రిటైర్నింగ్ వాల్ ఎత్తు పెంచడం అనేది ఇంజనీర్లతో మాట్లాడిచూస్తాం.. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి అవసరం అనుకుంటే ఆక్రమణలు తొలగిస్తామని సీఎం తెలిపారు. మిషన్ కాకతీయ అనేదే కమీషన్ కాకతీయ అని దివంగత నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలోనే చెప్పాడని రేవంత్ పేర్కొన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పటిష్టం చేశామని గత పాలకులు చెప్పుకున్నారు.. మరి గతంలో తెగని చెరువులు, ఇప్పుడు ఎందుకు తెగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దాదాపు 42సెంటీమీటర్ల వర్షం అంటే ఇది అత్యధిక వర్షపాతం. 75సంవత్సరాల్లో ఇంత వర్షం పడలేదు. అంతవిపత్తు జరిగినా ప్రాణనష్టాన్ని తగ్గించడం అంటే అది ప్రభుత్వ ముందు చూపే. వరదలపై మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఆయన ముందు మీ నాయకుడు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాలువలు ఆక్రమించి కట్టిన హాస్పిటల్ విషయంలో స్పందించాలి. హరీశ్ రావు అక్కడకు వెళ్లి దగ్గరుండి ఆక్రమణలు తొలగించమనిచెప్పి ఆదర్శంగా ఉండాలని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన భారీ నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వంకు లేఖ రాశాం. వారినుంచి స్పందన రావాలని రేవంత్ రెడ్డి అన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో మృతిచెందిన వారికి రూ. ఐదు లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించామని అన్నారు. వరదల సహాయంతో మా మంత్రులు ప్రజలతోనే ఉన్నారు. మా ప్రజలు మమ్మలను అడుగుతారు.. నిలదీస్తారు. వారు మావారే.. మాకు ఓటువేసి గెలిపించారు. మమ్మల్ని అడగకుంటే ఫాం హౌస్ లో పడుకున్న వారిని అడుగుతారా అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇటువంటి విపత్తు సమయంలో గతంలో ముఖ్యమంత్రులు హామీలు ఇచ్చారు.. కానీ అమలు చేయలేదు. మాది చేతల ప్రభుత్వం.. గత ప్రభుత్వ హామీలుకూడా మేము అమలు చేశారు. రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా విపత్తు నిర్వహణ సంస్థ సిద్ధం చేస్తున్నాం. ముందు బాధితులకు రూ.10వేలు తక్షణం అందిస్తామని చెప్పామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :