Studio18 News - TELANGANA / : తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్‌కు భారీ ఊరట లభించింది. మహబూబాబాద్‌లో ఈ నెల 25న ఉదయం పది గంటలకు నిర్వహించ తలపెట్టిన మహా ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. వెయ్యి మంది రైతులతో ధర్నా నిర్వహించేందుకు బీఆర్ఎస్‌కు కోర్టు అనుమతించింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన, రైతు ధర్నాను ఈరోజు (నేడు) చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కానీ పోలీసులు అనుమతించలేదు. దీంతో ఈ నెల 25న చేపట్టాలని నిర్ణయించింది. ఈ గిరిజన, రైతు ధర్నాకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో ప్రతిపక్షానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
Also Read : వర్మపై మరో కేసు నమోదు
Admin
Studio18 News