Studio18 News - TELANGANA / : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నియోజకవర్గంలోని కాసిపేట, కన్నెపల్లి మండలాలలో పర్యటించి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయా మండలాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఆశీర్వాదంతో బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, అందుకు మనమందరం కలిసికట్టుగా పనిచేయవలసి ఉంటుందని, దానికి మీరందరూ నాకు సహకరించి బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్దిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Also Read : nagarkurnool : మున్సిపల్ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు
Admin
Studio18 News