Studio18 News - తెలంగాణ / : చెరువుల ఆక్రమణ అంశంపై ప్రభుత్వానికి ఎవరి పైనా రాజకీయ కక్ష సాధింపు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై ఆయన మాట్లాడుతూ... చెరువుల ఆక్రమణను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. ఆక్రమణకు గురైన చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాతావరణ కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చెరువులకు సంబంధించి ప్రభుత్వ లెక్కలు, రికార్డులు ఉన్నాయని, ఆ మేరకు ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలవనరులను రక్షించుకోవాల్సి ఉందన్నారు. చెరువుల రక్షణపై స్థానికులే ముందుకు రావాలన్నారు. ఆక్రమణలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్నారు. హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.
Admin
Studio18 News