Tuesday, 03 December 2024 04:46:37 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Revanth Reddy: షాద్ నగర్ ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

Date : 07 August 2024 12:12 PM Views : 71

Studio18 News - తెలంగాణ / : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులు ఒక చోరీ కేసులో దళిత మహిళను స్టేషన్ కు తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం తీవ్రంగా స్పందించారు. కేసు పూర్వాపరాలు తెలుసుకొని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడారు. సీఎం రేవంత్ సూచనలతో వెంటనే స్పందించిన డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క సంబంధిత పోలీస్ అధికారులు, సిబ్బందిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. డిప్యూటి సీఎం భట్టి ఆదేశాలతో సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి వెంటనే చర్యలు చేపట్టారు. ఒక సీఐ సహా ఆరుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు కమిషనర్ అవినాశ్ మహంతి. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వంలో షాద్ నగర్ వంటి సంఘటనలను సహించబోమని డిప్యూటి సీఎం భట్టి .. పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి వైద్య సహాయంతో పాటు సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని సంబంధిత అధికారుల ద్వారా డిప్యూటి సీఎం భట్టి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన పోలీస్ అధికారులకు ఆయన సూచించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :