Studio18 News - తెలంగాణ / : కేంద్ర సహాయమంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాళ్లు మొక్కారు. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో రాడార్ శంకుస్థాపన కార్యక్రమం కోసం రాజ్‌నాథ్ సింగ్ వచ్చారు. హైదరాబాద్ చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఘన స్వాగతం పలికారు. కిషన్ రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. కేంద్రమంత్రికి శాలువా కప్పిన బండి సంజయ్.. అంతకుముందు ఆయన పాదాలను తాకారు.
Admin
Studio18 News