Studio18 News - తెలంగాణ / : Hyderabad Metro – Super Saver Offer: హైదరాబాద్ మెట్రో రైల్ అందిస్తున్న హాలీ డే సూపర్ సేవర్ ఆఫర్‌ను వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించారు. సూపర్ సేవర్ ఆఫర్‌ను రూ.59కి అందిస్తోన్న విషయం తెలిసిందే. సూపర్ సేవర్ ఆఫర్ కార్డు తీసుకుని అన్ని సెలవు దినాల్లో 59 రూపాయల చొప్పున చెల్లించి అపరిమితంగా ప్రయాణం చేయవచ్చు. గతంలో మెట్రో ప్రయాణికులు కొనుగోలు చేసిన హాలిడేస్ కార్డుతోనూ ఈ సౌకర్యాలు పొందవచ్చు. హాలీ డే సూపర్ సేవర్ కార్డులేని వారు రూ.100 చెల్లించి కొత్త హాలిడే కార్డును కొనుగోలు చేయవచ్చు. 2025, మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎల్అండ్‌టీ మెట్రో ఓ ప్రకటనలో తెలిపింది. నగరాన్ని సందర్శించేందుకు వచ్చే టూరిస్టులకు, నగరంలో దూరప్రాంతాలు ప్రయాణం చేసే వారికి ఈ ఆఫర్ చాలా ఉపయోగపడుతుందని చెప్పింది. సెలవు దినాల్లో మెట్రో రైళ్లలో ప్రయాణికులు తక్కువగా కనపడతారు. దీంతో ఆయా రోజుల్లో ప్రయాణికులు మెట్రో రైళ్లలోనే ప్రయాణించేలా, రూ.59కే హైదరాబాద్ మొత్తం ప్రయాణం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
Admin
Studio18 News