Studio18 News - TELANGANA / HYDERABAD : షోటోకాన్ కరాటే డూ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్, ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలోని పింక్ బీ బ్లూ స్కూల్లో రెండు రోజుల పాటు జరగనున్న అంతర్ పాఠశాల క్రీడా పోటీలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు రన్నింగ్. జిమ్నాస్టిక్. కరాటే పోటీలు నిర్వహిస్తున్నారు. అనంతరం నిర్వాహకులు రామకృష్ణ వైభవ్ మాట్లాడుతూ... క్రీడలు విద్యార్ధులను ఉన్నతమైన భవిష్యత్ దిశగా నడిపిస్తాయని, ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఏదొక క్రీడలో ప్రావీణ్యం సాధించాలని, ప్రతిఒక్కరూ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తారని, కానీ విజయం ఒకరినే వరిస్తుందన్నారు. ఓటమితో జీవితం ముగిసినట్లు కాదని, రేపటి విజయానికి తొలిమెట్టుగా స్ఫూర్తితో ముందుకెళ్ళాలని సూచించారు. మన విజయం మరొకరికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
Also Read : #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
Admin
Studio18 News