Tuesday, 03 December 2024 04:43:41 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

Date : 16 September 2024 01:53 PM Views : 84

Studio18 News - తెలంగాణ / : Minister Ponnam Prabhakar : గణేశ్ నవరాత్రులు విజయవంతం అయ్యాయని, గణనాథుల నిమజ్జనోత్సవాలకు సర్వం సిద్ధం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఖైరతాబాద్ మహాగణపతిని పొన్నం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేపు ఉదయం జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశామని తెలిపారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 131 క్రేన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 300కుపైగా క్రేన్లు అందుబాటులో ఉంచామని వివరించారు. శివారు ప్రాంతాల్లో చెరువులు, మిని పాండ్స్ లో వినాయకుల నిమజ్జనం చేసుకు అవకాశం ఉందని తెలిపారు. త్వరగా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని ఉత్సవ కమిటీలకు విజ్ఞప్తి చేయడం జరిగిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభం అవుతుందని తెలిపారు. 70ఏళ్ల అనుభవం ఉత్సవ కమిటీకి ఉంది.. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతుందని అన్నారు. సాగర్ వైపు వచ్చే వినాయక నిమజ్జన వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వారికి సహాయం అందించేందుకు మా అలెర్ట్ టీంలు సిద్ధంటా ఉంటాయని చెప్పారు. ప్రభుత్వం తరపున నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనోత్సవాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :