Studio18 News - తెలంగాణ / : తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలకు ఏఐసీసీ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ అబ్జర్వర్లుగా వారిని నియమించింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు దక్కింది. మహారాష్ట్రలోని ఐదు డివిజన్లకు 11 మందిని నియమించగా... ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క ఉన్నారు. ఇక, ఝార్ఖండ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు తారిక్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిని పరిశీలకులుగా నియమించారు.
Admin
Studio18 News