Studio18 News - తెలంగాణ / : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం వెనుక దుబ్బాకలోని బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హస్తముందని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటనను అదే నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడికి దిగారు. దీంతో దుబ్బాక పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులను అక్కడి నుంచి పంపించి వేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి నిరసన సెగ తగలడంతో ఆయన పర్యటన విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల తనపై ట్రోలింగ్ చేశారంటూ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దుబ్బాకలో ఎమ్మెల్యేను తిరగనివ్వబోమని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ నినాదాలు చేయడంతో దుబ్బాక పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది.
Admin
Studio18 News