Studio18 News - తెలంగాణ / : నియంతృత్వ పోకడలకు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వమే నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. గిరిజన హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాదవ్ బయలుదేరారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. రాజ్యాంగ దినోత్సవం రోజునే రాజ్యాంగ హక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీరుగారుస్తోందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విద్యార్థిని శైలజ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వెళుతున్న తమ పార్టీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు.
Also Read : బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్... భారత్ తీవ్ర ఆందోళన
Admin
Studio18 News