Saturday, 14 December 2024 03:45:43 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Inhuman Incident: నట్టింట్లో తల్లి శవం.. ఆస్తుల కోసం కూతుళ్ల కొట్లాట!

Date : 26 July 2024 11:27 AM Views : 48

Studio18 News - తెలంగాణ / : మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని మరోమారు రుజువైంది. కన్నతల్లి శవానికి అంత్యక్రియలు నిర్వహించడం మానేసి ఆస్తుల కోసం కొట్టుకున్నారు కుమార్తెలు. చివరికి పెద్దల జోక్యంతో ఎప్పటికో ఆ తల్లికి అంత్యక్రియలు జరిగాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కోదాడకు చెందిన వెల్దినేని నాగమణి (80)కి ముగ్గురు కుమార్తెలు. వీరంతా ఆ తర్వాతి కాలంలో పెళ్లిళ్లు చేసుకుని ఖమ్మం, గుంటూరు, హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నాగమణి భర్త తనువు చాలించడం, కోదాడలోని స్థలం విలువైనది కావడంతో దాని కోసం కుమార్తెల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అవి అలా కొనసాగుతుండగానే నాగమణి బుధవారం మరణించారు. చనిపోయిన తల్లికి అంత్యక్రియలు నిర్వహించాలన్న స్పృహ కూడా లేకుండా కుమార్తెలు ఆమె మృతదేహాన్ని అలానే ఉంచి ఆస్తి పంపకాల కోసం గొడవ పడ్డారు. చివరికి పెద్దలు జోక్యం చేసుకొని రాజీ కుదర్చడంతో నిన్న సాయంత్రం తల్లికి దహన సంస్కారాలు నిర్వహించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :