Studio18 News - తెలంగాణ / : బీజేపీ మహిళా మోర్చా భాగ్యనగర్ జిల్లా అధ్యక్షురాలు మంజులా రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్, మకల్ పేట నియోజకవర్గం సైదాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ఏడు మాసాలు గడిచినా పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నదని, బీజేపీ మహిళా మోర్చా భాగ్యనగర్ జిల్లా అధ్యక్షురాలు మంజులా రెడ్డి ఆరోపించారు. అబద్ధపు, అసత్య ప్రచారాలతో మహిళలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. మహాలక్ష్మీ పథకం కింద ప్రతి నెల మహిళకు రూ.2500. ఏటా లక్ష రూపాయలు ఇస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాజపా మహిళా కార్పోరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.
Also Read : Sangareddy : ప్రజా ప్రతినిధులకు ఘనంగా సన్మానం
ADVT
Admin
Studio18 News