Saturday, 14 December 2024 03:18:08 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Tornado: మేడారం అడవుల్లో ఘోర విపత్తు .. కుప్పకూలిన 50వేల అరుదైన జాతి వృక్షాలు

Date : 04 September 2024 03:16 PM Views : 46

Studio18 News - తెలంగాణ / : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుమారు 50వేల చెట్లు నేలమట్టం అవ్వడం అధికార యంత్రాంగాన్ని తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. అడవుల్లో పెద్ద ఎత్తున గాలి దుమారం, సుడి గాలుల బీభత్సంతో మహావృక్షాలు సైతం కుప్పకూలాయి. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 31న సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య మేడారం ప్రాంతంలో భారీ వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో ఏటూరు నాగారం మండలం కొండాయి నుండి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకూ భారీ నష్టం జరిగింది. సుమారు 15 కిలో మీటర్ల పరిధిలో దాదాపు 150 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 50వేల చెట్లు నేలకూలాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఈ నెల 1న పరిశీలనకు వెళ్లి చూశారు. అక్కడి దృశ్యాలను చూసి వారు షాక్ కు గురయ్యారు. టోర్నడోల్లాంటి బలమైన సుడిగాలులే ఈ స్థాయి లో చెట్లను కూల్చివేస్తాయని వాతావారణ నిపుణులు అంటున్నారు. భారీ వృక్షాలు సైతం నేలకొరగడాన్ని బట్టి చూస్తే గంటకు 120 కిలో మీటర్ల వేగంతో వీచిన గాలులే కారణం అయి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. జిల్లా ఫారెస్ట్ అధికారి రాహుల్ జావేద్ ఆధ్వర్యంలోని బృందం ఉపగ్రహ డేటా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్‌సీ) తో కలిసి పరిశీలన జరుపుతోంది. సీసీఎఫ్ ప్రభాకర్ తో కలిసి డీఎఫ్ఓ మంగళవారం తాడ్వాయ్ – మేడారం అడవుల్లో నేలమట్టమైన చెట్లను పరిశీలించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :