Studio18 News - తెలంగాణ / : Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోమవారం తీగల కృష్ణారెడ్డి కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను టీడీపీలో చేరతానని చెప్పారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వల్లనే హైదరాబాద్ నగరంలో అభివృద్ధి జరిగిందని అన్నారు. తెలంగాణలో టీడీపీకి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని, వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి రాబోయే కాలంలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తీగల కృష్ణారెడ్డి అన్నారు.
Admin
Studio18 News