Saturday, 14 December 2024 02:42:02 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Revanth Reddy: ఢిల్లీకి రేపు సీఎం రేవంత్‌రెడ్డి.. క్యాబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చ!

Date : 15 October 2024 11:51 AM Views : 26

Studio18 News - తెలంగాణ / : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు (బుధవారం) మరోమారు ఢిల్లీకి వెళ్లనున్నారు. చాలాకాలంగా వాయిదా పడుతున్న రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ విషయాన్ని ఈసారి తేల్చుకునే వస్తారని సమాచారం. దీంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాలను హైకమాండ్‌తో చర్చిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈసారి సీఎం పర్యటనలో క్యాబినెట్ విస్తరణ అంశం కొలిక్కి వస్తుందని భావిస్తున్న ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు అవుతోంది. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో క్యాబినెట్ విస్తరణ జరగలేదు. ఇదే విషయమై అధిష్ఠానంతో చర్చించేందుకు రేవంత్‌రెడ్డి పలుమార్లు హస్తినకు వెళ్లినా పని కాలేదు. ఇటీవల జరిగిన హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికలకు ముందే క్యాబినెట్‌ను విస్తరించాలని అనుకున్నారు. అయితే, హైకమాండ్ పెద్దలు ఆ ఎన్నికలపై దృష్టి పెట్టడంతో క్యాబినెట్ విస్తరణ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొంటున్న రేవంత్‌రెడ్డి.. అనంతరం పార్టీ పెద్దలతో సమావేశమై క్యాబినెట్ విస్తరణ అంశంపై చర్చించి జాబితాతో తిరిగి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :