Saturday, 17 January 2026 09:47:14 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ

ఆ అవసరమే తమకు లేదన్న మంత్రి సీతక్క వ్యక్తిగత కారణాలవల్లే ఆత్మహత్యాయత్నం చేశాడని వివరణ అసెంబ్లీలో మంత్రి సీతక్క వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ

Date : 17 March 2025 05:47 PM Views : 427

Studio18 News - TELANGANA / : బీసీ సంక్షేమ వసతి గృహాలలో వసతులు సరిగా లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవల తన నియోజకవర్గంలోని బీసీ హాస్టల్ లో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడని తెలిపారు. ఆ విద్యార్థి రెండు రోజులుగా కోమాలో ఉన్నాడని వివరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయాన్ని బయటకు రానీయకుండా తొక్కిపెట్టిందని ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. అయితే, ఈ ఆరోపణలను మంత్రి సీతక్క ఖండించారు. ఏ విషయాన్నీ తొక్కిపెట్టాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. సదరు విద్యార్థి వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యాయత్నం చేశాడని, మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని వివరించారు. నీలోఫర్ లో చేర్పించి విద్యార్థికి చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో రాజకీయం చేయొద్దంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రి సీతక్క హితవు పలికారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నట్లు కేసీఆర్ పాలనలో హాస్టళ్ల నిర్వహణ బాగుండేదనే మాటే నిజమైతే.. కేసీఆర్ పదేళ్ల పాలనలో మొత్తం 114 మంది గురుకుల విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో చెప్పాలని మంత్రి సీతక్క నిలదీశారు. దుబ్బాక హాస్టల్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనకు సంబంధించి నివేదిక తెప్పించుకుని సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :