Studio18 News - TELANGANA / NAGARKURNOOL : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చం పేట పట్టణంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవల్లో భాగంగా స్థానిక డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలో ఆర్టీసీ సిబ్బంది విద్యార్థులతో పట్టణ ప్రధాన వీధుల వెంట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాద నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్లను తప్పక ధరించాలని సూచించారు. అతివేగమే ప్రమాదాలకు కారణం అవుతున్నాయని, వాహనాలను తగిన వేగంతో నడిపి ప్రమాదాలను నివారించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదని, మధ్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి చట్టప్రకారం శిక్షించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట సిఐ రవీందర్, ఆర్టీవో , ఆర్టీసీ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Studio18 News