Studio18 News - తెలంగాణ / : దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలను కోదండరాం ఖండించారు. దివ్యాంగులు కొన్ని ఉద్యోగాలకు పనికి రారన్న ఆమె వ్యాఖ్యలు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమన్నారు. వైకల్యం పేరుతో వారి హక్కులను హరించడం దారుణమన్నారు. చట్టాలను అమలు చేయాల్సిన ఐఏఎస్ అధికారిణి వైకల్యాన్ని కించపరచడం సరికాదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం ప్రకటించకపోగా... ఇంకా వాటిని సమర్థించుకోవడం దారుణమని స్మితా సబర్వాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజం ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మాటలు రాకుండా ప్రభుత్వం చూడాలన్నారు.
Admin
Studio18 News