Saturday, 14 December 2024 07:36:21 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

రాయదుర్గం మల్కంచెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు

Date : 02 August 2024 11:17 AM Views : 57

Studio18 News - తెలంగాణ / : Road Accident : హైదరాబాద్ పరిధిలోని రాయదుర్గం మల్కం చెరువు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంది హిల్స్ నుండి వేగంగా వచ్చిన కారు మల్కం చెరువు వద్ద ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జిని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారు నడుపుతున్న యువకుడు స్పాట్ లో మృతిచెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. మృతుడు ICFAI యూనివర్సిటీ లో BBA చదువుతున్న విద్యార్థి చరణ్(19)గా గుర్తించారు. బీఎన్ఆర్ హిల్స్ నుండి స్విఫ్ట్ డిజైర్ కారులో మెహదీపట్నంలోని తన ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండడం పట్ల నగరవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రమాదంలో.. ఒకరి మృతి దుండిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కాజీపల్లి బ్రిడ్జి వద్ద బైక్ ను ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొనడంతో ఎర్రోళ్ల కిషన్(62) అనే వ్యక్తి చనిపోయాడు. మృతుడు మెదక్ జిల్లా అన్నారం గ్రామానికి చెందిన వాసిగా గుర్తించారు. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న కిషన్ విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ప్రమాదం బారినపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :