Wednesday, 17 December 2025 02:31:10 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

KTR: కొండల్ రెడ్డి పర్యటన విజయవంతమైందని రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారేమో: కేటీఆర్ సెటైర్లు

Date : 16 August 2024 05:13 PM Views : 213

Studio18 News - TELANGANA / : సీఎం రేవంత్ రెడ్డి నిన్న చాలా రంకెలు వేశారని, కొండల్ రెడ్డి (రేవంత్ రెడ్డి సోదరుడు) ఆస్ట్రేలియా పర్యటన విజయవంతమైతే... తన పర్యటన సక్సెస్ కాలేదనే ఫ్రస్ట్రేషన్ లో ముఖ్యమంత్రి ఉన్నట్లుగా కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కొండల్ రెడ్డికి వర్కవుట్ అయినట్లుగా రేవంత్ రెడ్డికి అమెరికాలో వర్కవుట్ అయినట్లుగా లేదని ఎద్దేవా చేశారు. అదే సమయంలో ఇక్కడ తిరుపతి రెడ్డి పేరు బాగా ప్రచారం సాగిందన్నారు. తన కుటుంబ సభ్యులు దూసుకు వెళ్తున్నారనే బాధ రేవంత్ రెడ్డిలో ఉందా? లేక తాను తెలంగాణలో లేని సమయంలో భట్టివిక్రమార్క బాగా తిరిగారనే ఆందోళన ఉందా? లేక అధిష్ఠానం ఏమైనా అంటుందనే బాధ ఉందా? అనేది అర్థం కావడం లేదన్నారు. ఫ్రస్ట్రేషన్ లో ఏదో మాట్లాడుతున్నారని విమర్శించారు. బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని పంద్రాగస్ట్ రోజున సీఎం రేవంత్ రెడ్డి కొత్త విషయం చెప్పారని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉందని తెలియక మనవాళ్లు ఉత్తరాదికి వెళ్తున్నారని సెటైర్ వేశారు. తమ హయాంలో రుణమాఫీతో పాటు రైతుబంధు కూడా అమలు చేశామన్నారు. రుణమాఫీపై సవాల్ రుణమాఫీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని ఆయన చెప్పిన ఊరికే వెళదామని... రుణమాఫీపై ఆయన చెప్పింది నిజమని, 100 శాతం రుణమాఫీ అయిందని రైతులు చెబితే తాను పదవికి రాజీనామా చేసి, రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు. ఏదైనా ఒక్క రైతు వేదికలో 100 శాతం రుణమాఫీ అయినట్లు చెప్పించగలరా? అని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు తిరిగి.... ఎంతమందికి రుణమాఫీ అయిందో వెలికి తీస్తారన్నారు. రైతు రుణమాఫీ పేరుతో మోసం చేశారని ఆరోపించారు. రుణమాఫీని గత ఏడాది డిసెంబర్ 9 నుంచి ఆగస్ట్ 15 వరకు జాప్యం చేశారన్నారు. రుణమాఫీకి సంబంధించి బ్యాంకులకు 9 నెలల వడ్డీని ఎవరు కడతారో చెప్పాలని నిలదీశారు. 22.37 లక్షల మంది రైతులకు... రూ.17,934 కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారన్నారు. రుణమాఫీ 40 శాతం మాత్రమే అయిందన్నారు. అరవై శాతం మందికి రుణమాఫీ ఎగ్గొట్టారన్నారు. రుణమాఫీలో అనేక కోతలు పెట్టారన్నారు. సీఎం అంటే కటింగ్ మాస్టర్‌లా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రుణమాఫీకి కొర్రీలు చెప్పని కాంగ్రెస్... ఇప్పుడు మాత్రం ఎన్నో కొర్రీలు పెడుతోందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ మోసం... కేసీఆర్‌పై ద్వేషం... ఇదే ఈ ప్రభుత్వం తీరు అన్నారు. రుణమాఫీ, ఉద్యోగాలు, ఆడపడుచులకు తులం బంగారం, నెలకు రూ.2500, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, జాబ్ క్యాలెండర్, దళితులకు రూ.12 లక్షలు, ఆటో అన్నలకు ఏడాదికి రూ.12 వేలు, రైతు కూలీలకు నెలకు రూ.1000... ఇలా అన్నింటా మోసమే చేశారన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అని ఎవరైనా మూడుసార్లు ప్రకటన చేస్తారా? ఏదో పాత గోడకు కొత్త సున్నం అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఏకకాలంలో అంటే ఒకేసారి చేయాలి... ఒకేసారి ప్రకటన ఇవ్వాలన్నారు. అయినా ముఖ్యమంత్రికి పాత గోడకు కొత్త సున్నం వేసిన అనుభవం ఉన్నట్లుగా ఉందని సెటైర్ వేశారు. రేవంత్ రెడ్డి అడ్డమైన ఫీట్లు చూసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు కూడా ఈ మోసాలను చూసి ఆశ్చర్యపోతున్నారన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :