Studio18 News - తెలంగాణ / : ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించినందుకు అందుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీకి, న్యాయవాదులకు అభినందనలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సెటైర్లు వేశారు. వారి అలుపెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయని చెప్పారు. ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటికీ విజయమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకురాలు బెయిల్‌పై బయట వచ్చారని, ఇదే సమయంలో కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళ్లారని చెప్పారు. కవితకు బెయిల్ కోసం వాదించిన అభ్యర్థిని కాంగ్రెస్ ఏకగ్రీవంగా రాజ్యసభకు పంపిందని సింఘ్వీని ఉద్దేశించి బండి సంజయ్ చురకలు అంటించారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడికి మద్దతు ఇవ్వడంలో కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురత ప్రదర్శించారని అన్నారు. వైన్, డైన్ చేసే క్రైమ్‌లో భాగస్వాములకు అభినందనలంటూ సెటైర్లు వేశారు. కాగా, కవితకు బెయిల్ రావడంతో బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ షురూ అవుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్న విషయం తెలిసిందే. వారికి కౌంటర్ ఇచ్చేందుకు బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Admin
Studio18 News