Friday, 14 February 2025 08:39:30 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

దాని కోసమే అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్ వాడుకుంది: మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

Date : 03 August 2024 04:18 PM Views : 95

Studio18 News - TELANGANA / : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆరు రోజులు జరిగిన ఈ సమావేశాల్లో జీరో అవర్ లేనే లేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కారని, బీఆర్‌ఎస్‌ను తిట్టించేందుకు సమావేశాలను కాంగ్రెస్ వాడుకుందని అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ లేదని, ఏడు నెలల్లో సీఎం రేవంత్ వికృత రూపం చూపించారని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. తప్పుడు పత్రాలతో సీఎం అందరినీ తప్పుదోవ పట్టించారని తెలిపారు. సీఎం ఒక ఆటవిక రాజ్యాధికారిగా వ్యవహరించారని, కాంగ్రెస్ హామీల ఊసే బడ్జెట్‌లో లేదని చెప్పారు. తాము లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని అన్నారు. జాబ్ క్యాలండర్‌కు చట్టబద్ధత తెస్తామన్నారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా తమ మహిళా నేతలను అవమాన పరిచారని అన్నారు. సీఎం, మంత్రులు అన్నీ అసత్యాలే చెప్పారని తెలిపారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల ఉద్యోగాలు ఏ ప్రభుత్వం అయినా భర్తీ చేస్తుందా అని నిలదీశారు. 75 కోట్ల రూపాయలతో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానన్న భట్టిని కేంద్ర ఇరిగేషన్ మంత్రిని చేయాలని ఎద్దేవా చేశారు. నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టులు వెయ్యి కోట్లతో పూర్తి చేయవచ్చని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :