Studio18 News - తెలంగాణ / : ఉత్తర ప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలో లోక కళ్యాణార్థం శ్రీ సాంబ సదాశివ మహదేవ సేవా సమితి, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ నేతృత్వంలో నిర్వహింపతలపెట్టిన కోఠి పార్థివ శివలింగార్చన లక్ష బిల్వర్చాన కోసం తమవంతుగా ఉడుతా భక్తిగా సభక్తిపూర్వకంగా రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట ఆర్యవైశ్య సంక్షేమ సంఘం అద్వర్యంలో ఆర్యవైశ్య మహిళలు 16 వేల పార్థీవ లింగాలను తయారు చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. రానున్న కార్తీక మాసం సందర్భంగా కాశీ మహా క్షేత్రంలోని ముముక్షు భవన్ ప్రాంగణంలో అత్యంత వైభవముగా కోఠి పార్థివ శివలింగార్చన, లక్ష బిల్వర్చాన నిర్వహించనున్నమని ఈ సందర్భంగా అనేక మంది వేదపండితులచే ఆద్యాత్మిక వాతావరణంలో నిర్వహింపబడే ఈ మహత్తర కార్యక్రమానికి తమవంతుగా పార్థీవ లింగాలను తయారు చేసి అందించడం తమ పూర్వజన్మ సుకృతమని ఈ సందర్భంగా సంఘ సభ్యులు పేర్కోన్నారు.
Admin
Studio18 News