Saturday, 14 December 2024 03:08:26 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పై స్పందించిన కేసీఆర్.. అసెంబ్లీలో చీల్చిచెండాడుతామని వెల్లడి

Date : 25 July 2024 02:34 PM Views : 50

Studio18 News - తెలంగాణ / : BRS Chief KCR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ. 2,91,159 కోట్లు కేటాయించారు.. బడ్జెట్ లో పలు రంగాలకు కేటాయింపులపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. అధికారం కోల్పోయిన తరువాత తొలిసారి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడారు. ఈ బడ్జెట్ తెలంగాణ ఆశలపై నీళ్లు చల్లింది. ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది. స్టోరీ టెల్లింగ్ బడ్జెట్ ప్రసంగం అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. బడ్జెట్ లో ఒక్క పాలసీ ప్రస్తావన లేదని విమర్శించారు.బడ్జెట్ లో కొత్తేమీ లేదు. ఏ సంక్షేమ పథకం ఇందులో లేదు. ఒత్తిఒత్తి పలకడం తప్ప భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏమీ కనిపించలేదు. ఆరు మాసాలు సమయం ఇవ్వాలని నేను ఇన్నాళ్లు రాలేదని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రెండు పంటలకు రైతు బంధు ఇచ్చాము.. కాంగ్రెస్ హయాంలో రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. రైతుకు ఈ బడ్జెట్ లో ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని అన్నారు. అంతా ప్రసంగమే తప్ప బడ్జెట్ లో సరైన శాఖలకు కేటాయింపులు ఏమీ లేదు. దళిత వర్గాల ప్రస్తావనే లేదు. దళిత బంధు ఊసే లేదు. మత్స్యకారులకు భరోసా లేదు. గొర్రెల పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టారని కేసీఆర్ అన్నారు. ఐటీ పాలసీ ఏమీ లేదు. పేద ప్రజల అభివృద్ధికి సంబంధించి ఎలాంటి పాలసీ లేదు. వ్యవసాయ స్థిరీకరణ లేదు. బడ్జెట్ ప్రసంగం మొత్తం ఓ స్టోరీ చెప్పినట్లుగానే ఉందని కేసీఆర్ విమర్శించారు. ఈ బడ్జెట్ పై అసెంబ్లీలో చీల్చి చెండాడుతామని కేసీఆర్ అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :