Studio18 News - TELANGANA / : దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో బాబూ జగ్జీవన్ రాం వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ వారు చేసిన సేవలు ఈ తరానికి ఒక స్ఫూర్తిగా నిలిచేల కృషి చేయాలన్నారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలన్నారు.. జగ్జీవన్ రామ్ ఒక గొప్ప సంఘసంస్కర్త రాజకీయవేత్త సమాజంలో అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం కులరహిత సమాజం కోసం పోరాడిన ఒక గొప్ప పోరాట యోధుడు అని పేర్కోన్నారు.
Also Read : nirmal : బీజాక్షర లేఖనంపై వివాధం
Admin
Studio18 News