Saturday, 14 December 2024 04:12:16 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

DK Aruna: ఎన్నిక‌ల క‌లెక్ష‌న్ల కోస‌మే 'హైడ్రా': ఎంపీ డీకే అరుణ‌

Date : 30 August 2024 03:22 PM Views : 86

Studio18 News - తెలంగాణ / : ప్ర‌భుత్వ భూముల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం, చెరువుల‌ను ర‌క్షించ‌డం కోసం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా (హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ) ను తీసుకువ‌చ్చారు. ఇప్పుడీ సంస్థ క‌బ్జాదారుల‌ను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. న‌గ‌రంలో నిత్యం ఎక్క‌డో ఒక‌చోట ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం చేస్తోంది హైడ్రా. సెల‌బ్రిటీలు, ప్ర‌జాప్ర‌తినిధులు, ఇత‌ర ప్ర‌ముఖులు అనే తేడా లేకుండా, ఆక్ర‌మ‌ణ రుజువైతే క‌ట్ట‌డాల‌ను కూల్చేయ‌డం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో కొంద‌రు నేత‌లు హైడ్రాకు పూర్తి మ‌ద్ద‌తు ఇస్తుంటే.. మ‌రికొందరు మాత్రం క‌న్నెర్ర చేస్తున్నారు. ఇక హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో నిరుపేద‌ల ఇళ్ల‌ను కూల్చివేయ‌డం ప‌ట్ల ఆమె మండిప‌డ్డారు. జ‌మ్మూకశ్మీర్‌, ఝార్ఖండ్‌, మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానాలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కలెక్షన్ల కోసమే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఆక్రమణ జరిగితే ఓ పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు ఇళ్లు కట్టిస్తే, ఈ ప్రభుత్వం కూల్చేస్తోందని విమర్శించారు. హామీలను అమలు చేయలేకే హైడ్రా పేరుతో రేవంత్ హడావుడి చేస్తున్నారని అరుణ దుయ్య‌బ‌ట్టారు. వెంట‌నే కాంగ్రెస్ ప్ర‌భుత్వం స్పందించి ఇళ్లు కోల్పోయిన పేద‌ల‌కు న్యాయం చేయాల‌న్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :