Studio18 News - తెలంగాణ / : మాదక ద్రవ్యాల రవాణా, అమ్మకాలపై నిఘా పెంచాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తో కలిసి మాదకద్రవ్య నిరోధక సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో మత్తు పదార్థాల నివారణ, పండించడం, రవాణా పై తీసుకోవలసిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... గంజాయి ఉత్పత్తి, రవాణా వినియోగంపై అధికారులు పటిష్ఠ నిఘా పెట్టి నాగర్ కర్నూల్ జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల నందు యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులలో మత్తు పదార్థాలపై, వాటి వల్ల కలుగు అనర్ధాలపై అవగాహనను కల్పించాలని సూచించారు. గంజాయి నిర్మూలనకై ప్రత్యేకంగా ర్యాలీలు, వ్యాసరచన పోటీలు, నిర్వహిస్తూ అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ....గంజాయి అక్రమ రవాణా అరికట్టడానికి పోలీస్ యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు నిర్వహిస్తోందన్నారు. జిల్లాలోకి ప్రవేశించే ప్రధాన ప్రాంతాలు, చెక్ పోస్టుల వద్ద 24 గంటలు నిఘా ఏర్పాటు చేశామన్నారు.. సమాజంలో మరియు విద్యా సంస్థల నందు, మత్తు పదార్థాలపై ఎటువంటి సమాచారం ఉన్న పోలీసు అధికారులకు సూచించాలని తెలిపారు.
Also Read : mancherial : నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా
Admin
Studio18 News