Studio18 News - తెలంగాణ / : Seethakka: తెలంగాణ మంత్రి సీతక్క వీడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై న్యాయవాది వెంకట నాయక్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోని మార్ఫింగ్ చేసి సౌండ్స్ మార్చి ఎక్స్ ఖాతాలో సర్కులేట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియోను కూడా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యలేట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. అడ్వకేట్ వెంకట నాయక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐటీఏ-2000-200 79,33, (4),353(1) బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మంత్రి సీతక్క వీడియో మార్ఫింగ్ పై తెలంగాణ శాసనసభలోనూ చర్చ జరిగింది. సోషల్ మీడియాతో మార్ఫింగ్ వీడియోలు ఇష్టారాజ్యంగా పోస్ట్ చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు. గిరిజన మహిళా మంత్రి మీద కూడా ఇటువంటి పోస్టులు చేస్తున్నారని అన్నారు.
Admin
Studio18 News