Saturday, 07 March 2026 08:17:09 PM
# సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం

Peddapalli : పెద్దపల్లి మార్కెట్‌లో ఫ్రీగా కూరగాయలు.. అసలు విషయం ఏమిటంటే?

Date : 27 August 2024 02:28 PM Views : 642

Studio18 News - TELANGANA / : peddapalli : పెద్దపల్లి మార్కెట్ లో కూరగాయాలను ఉచితంగా అందజేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఉచిత కూరగాయలకోసం భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. ఇంతకీ కూరగాయలు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారని ఆరా తీస్తే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫ్రీగా కూరగాయలు ఇస్తుంది రిటెయిల్ వ్యాపారులు. గతకొద్దిరోజులుగా పెద్దపల్లి కూరగాయల మార్కెట్ లో హోల్ సెల్ అండ్ రిటెయిల్ కూరగాయల వ్యాపారస్తులకు మధ్య వివాదం నడుస్తుంది. ఒప్పందం ప్రకారం హోల్ సెల్ వ్యాపారులు రిటెయిల్ గా కూరగాయలు విక్రయించొద్దని నిబంధన ఉంది. కానీ, వారు నిబంధనలు అతిక్రమించి కిలోల చొప్పున కూరగాయలు రోజుమొత్తం అమ్ముతుండటంతో రిటెయిల్ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో హోల్ సెల్ వ్యాపారస్తుల తీరుకు నిరసనగా.. కూరగాయల మార్కెట్ బంద్ చేసి వినియోగదారులకు రిటెయిల్ వ్యాపారస్తులు ఫ్రీగా కూరగాయలు అందిస్తున్నారు. హోల్ సెల్ వ్యాపారులు వినియోగదారులకు రిటెయిల్ గా కూరగాయలు విక్రయిస్తుండటంతో మేము తీవ్రంగా నష్టపోతున్నామని రిటెయిల్ వ్యాపారస్తుల ఆవేదన వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :