Monday, 17 February 2025 04:30:55 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

రుణమాఫీ ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో అర్ధం కావడం లేదు : మాజీ మంత్రి హరీశ్ రావు

Date : 22 July 2024 02:22 PM Views : 61

Studio18 News - TELANGANA / : Harish Rao : రాష్ట్రంలో సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు సొంత డబ్బులతో పనులు చేయించారు. ఇప్పుడు వారి బదిలీ జరిగింది.. లబోదిబోమంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సోమవారం మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. పంచాయతీలకు కేంద్ర నిధులు వచ్చినా మంజూరు చేయడం లేదు. పంచాయతీ ఎన్నికలు కాకపోవడంతో 750 కోట్లు కేంద్రం నిధులు ఆపింది. అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అన్న చందంగా మారింది. ప్రతిపక్షం తట్టి లేపితే కానీ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొవడం లేదని హరీశ్ రావు విమర్శించారు.కేంద్రం 800 కోట్లు ఉపాధి హామీ పథకానికి ఇచ్చింది.. రాష్ట్ర వాటా కలిపి విడుదల చేయాలి. ఆర్ధిక సంఘం నిధులు 500 కోట్లు వచ్చినా ప్రభుత్వం విడుదల చేయడం లేదని హరీశ్ రావు అన్నారు. బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండు నెలలుగా జీతం లేదు. పంచాయతీ ఎన్నికలు పెట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వ హాస్టళ్ల లో పనిచేసే కింది సిబ్బందికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జీతాలు ఇప్పటివరకు రాలేదు. అసెంబ్లీలో అవకాశం వస్తే అన్ని అంశాలపై ప్రభుత్వం దుమ్ము దులుపుతా. నాకు అవకాశం వస్తే ఎనిమిది మంది మంత్రులు అడ్డుతగులుతున్నారని హరీశ్ రావు అన్నారు.రాష్ట్రంలో సమస్యలతో రోడ్డు ఎక్కని వర్గం లేదు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తుతుంది. విద్యుత్ వినియోగంలో పెద్దగా తేడా లేదు. విద్యుత్ స్టోర్ లలో మెటీరియల్ లేదు. ఉచిత కరెంట్ పథకానికి ఒక్క రూపాయి విడుదల కాలేదు. విద్యుత్ శాఖ ఆర్ధికంగా దివాళాతీసే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలలకు కొన్నిచోట్ల కరెంట్ కట్ చేశారని హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 91లక్షల మంది తెల్ల రేషన్ కార్డు దారులకు గృహజ్యోతీ అమలు కావడం లేదు. వృధాప్య పెన్షన్లు సక్రమంగా అందడం లేదు. మే నెల పెన్షన్ ఇప్పటి వరకు అందలేదు. పెంచిన పెన్షన్ అటుంచి పాత పెన్షన్ ఇవ్వడం లేదు. విడో పెన్షన్లు ఎనిమిది నెలలుగా ఆగిపోయాయని హరీశ్ అన్నారు. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన అమలు చేస్తున్నారు. 30నుంచి 40శాతం మందికి రుణమాఫీ జరుగలేదు. కోతలు పెట్టడానికి నిబంధనలు వాడుతున్నారు. రుణమాఫీ ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో అర్ధం కావడం లేదు. ప్రభుత్వానికి చిత్త శుద్ది ఉంటే కొత్త జీఓ తెచ్చి రైతులను రుణమాఫీ వర్తింప చేయాలి. రైతు, పాస్ బుక్ ఆధారంగా రుణమాఫీ ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :