Studio18 News - భక్తి / : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో కొనసాగుతున్న బీజాక్షర లేఖనంపై వివాధం కొనసాగుతుంది. ఈ మేరకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అనుష్టాన పరిషత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రముఖ పుణ్య క్షేత్రం చదువుల తల్లి నిలయం బాసర ఆలయ సమీపంలో ప్రైవేట్ గా కొంతమంది వ్యక్తులు నిర్వహిస్తున్న బీజాక్షరాల లేఖనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు జ్ఞాన సరస్వతి అనుష్టాన పరిషత్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అమ్మవారి ఆలయంలో ఆచారంగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా అక్షరాభ్యాసం, దీక్ష భిక్ష, అమ్మవారి పసుపు బండారికి ఇక్కడ ప్రాధాన్యత ఉందని కానీ గత కొన్ని రోజులుగా భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది కాసులు పోగు చేసుకుంటున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైన దేవస్థాన అధికారులు స్పందించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని శ్రీ జ్ఞాన సరస్వతి అనుస్థాన పరిషత్ డిమాండ్ చేసింది. కాగా గతంలోనే బాసరలో బీజాక్షరాలు రాయడం పై బాసర ఆలయ అధికారులు భక్తులకు సూచనలు చేస్తూ ప్లెక్సీలు ఏర్పాటుచేసినట్లుగా సమాచారం.
Also Read : RajannaSircilla : ఘనంగా డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి
Admin
Studio18 News