Tuesday, 10 March 2026 03:42:00 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Janmashtami 2024 : దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు.. కృష్ణయ్యను ఏ పూలతో పూజించాలి

Date : 26 August 2024 10:29 AM Views : 290

Studio18 News - భక్తి / : Janmashtami 2024 Puja Samagri : దేశ వ్యాప్తంగానేకాక, ప్రపంచ వ్యాప్తంగా హిందువులు పవిత్రంగా జరుపుకునే పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ పర్వదినాన్నే కృష్ణాష్టమి, గోకులాష్టమి.. ఇంకా అష్టమి రోహిణి అనికూడా అంటారు. ప్రతీ సంవత్సరం శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు. కృష్ణాష్టమి సందర్భంగా దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణుని దేవాలయాలు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ ఆలయాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఆ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. విష్ణువుకు అత్యంత ఇష్టమైన అవతారాల్లో శ్రీకృష్ణుడు అవతారం ఒకటని చెబుతారు. చిన్నతనంలో తల్లి యశోద బాల గోపాలుడిని అందంగా ముస్తాబు చేసేది. ఇందులో నెమలి కిరీటం, నడుము పట్టీ, ప్రకాశవంతమైన బొట్టు, చెవిపోగులు, పసుపు కండువా.. ఇలా మొదలైన వస్తువులతో శ్రీకృష్ణుడు ప్రకాశవంతంగా మెరిసేవారు. భక్తులు జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఈ వస్తువులన్నీ సమర్పించాలి. దీని వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సులు లభిస్తాయని నమ్ముతారు. వైదిక క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి ఆగస్టు 25 ఆదివారం సాయంత్రం 6.09 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఆగస్టు 26వ తేదీ (సోమవారం) సాయంత్రం 4,49 గంటలకు ముగుస్తుంది. ఈ సంవత్సరం జన్మాష్టమి నాడు చంద్రుడు వృషశరాశిలో ఉండటం వల్ల జయంతి యోగం ఏర్పడుతుంది. ఈ శుభ సమయంలో పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. జన్మాష్టమి ఆగస్టు 26వ తేదీ ఉదయం 12.01గంటల నుంచి 12.45గంటల వరకు ఉంటుంది. అంటే ఈ 45 నిమిషాల సమయంలో భక్తులు పూజ చేసుకోవడానికి అనువైన సమయం అని పండితులు పేర్కొంటున్నారు. కృష్ణాష్టమి రోజు కన్నయ్యను ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకం ప్రయోజనాలు చేకూరుతాయని పండితులు పేర్కొంటున్నారు. పారిజాత పూలతో ఆరాధిస్తే జాతకంలో ఉన్న పన్నెండు రకాల కాల సర్పదోషాలను తొలగించుకోవచ్చు. సంపగి పూలతో పూజిస్తే శత్రువులను మిత్రులుగా మార్చుకోవచ్చు. మల్లెపూలతో ఆరాధిస్తే శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. తమ్మిపూలతో ఆరాధిస్తే కృష్ణుడి పట్ల భక్తి మరింత పెరుగుతుందట. పద్మ పుష్పాలతో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధించి శ్రీమంతులు అవుతారు. గన్నేరు పుష్పాలతో పూజిస్తే వాక్చాతుర్యం పెరుగుతుంది. నందివర్ధనం పుష్పాలతో పూజిస్తే సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తాయి. తెల్లజిల్లేడు పూలతో ఆరాధిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి. ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. ప్రొద్దుతిరుగుడు పుష్పాలతో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని నమ్ముతారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :