Saturday, 14 December 2024 03:17:25 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Tirumala Garuda Seva: తిరుమలలో గరుడసేవ.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ.. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Date : 08 October 2024 10:50 AM Views : 25

Studio18 News - భక్తి / : Tirumala : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఐదోరోజు కు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు మోహినీ అవతారంలో భక్తులకు స్వామివారి దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు గరుడ వాహనం సేవ ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు విశిష్ట స్థానం ఉంది. గరుడుడిపై గోవిందుడిని దర్శించుకొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో నాలుగు రోజుల నుంచి భక్తుల రద్దీ కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ ఇవాళ గరుడ సేవ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం నుంచే తిరుమలకు భక్తులరాక పెరిగింది. మరోవైపు గరుడ సేవను వీక్షించేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్యాలరీల్లోకి రాలేని భక్తులు గరుడ సేవను తిలకించడానికి 28 భారీ హెచ్‌డీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గరుడ సేవను వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో.. గ్యాలరీల్లోకి ప్రవేశం, నిష్క్రమణ సమయాల్లో తోపులాటలు, తొక్కిసలాటలు లేకుండా పటిష్టమైన బ్యారికేడ్లు, క్యూలైన్లను టీటీడీ అధికారులు సిద్ధం చేశారు. తిరుమలలో దాదాపు 25 ప్రదేశాల్లో 9వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ స్థలాలు నిండిపోతే వాహనాలను తిరుపతిలోనే ఆపేయనున్నారు. తిరుపతిలో అదనపు పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. మరోవైపు మాడవీధుల్లో మొబైల్ క్లీనిక్ లు, 12 అంబులెన్స్ లు, వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొండపై పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు ఏడువేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,750 సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. గ్యాలరీల్లో దాదాపు రెండు లక్షల మంది కూర్చునే అవకాశం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగురోడ్డులో వేచిఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం నార్త్ వెస్ట్ కార్నర్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా అనుమతించి దర్శనం కల్పించనున్నారు. శ్రీవారి గరుడ వాహన సేవ సందర్భంగా తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి బుధవారం ఉదయం 9గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఘాట్ రోడ్డులో ప్రైవేట్ ట్రాక్సీలకు అనుమతి నిలిపివేశారు. రాత్రి 9గంటల నుంచి ద్విచక్ర వాహనాలకు అనుమతి నిలిపివేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :