Tuesday, 10 March 2026 02:08:51 PM
# శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ # హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా

Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చక్రస్నానానికి పుష్కరిణిలో భారీ ఏర్పాట్లు

Date : 11 October 2024 11:48 AM Views : 209

Studio18 News - భక్తి / : Tirumala Brahmotsavam 2024: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం 7గంటల నుంచి శ్రీవారి రథోత్సవం ప్రారంభమైంది. మహారథంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేస్తున్నారు. ఇవాళ రాత్రికి స్వామివారు అశ్వాహనంపై విహరించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నానం శనివారం నిర్వహించనున్నారు. ఇందుకోసం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు శనివారం ఉదయం చక్రస్నానం నిర్వహించనున్నారు. వైదికంగా నిర్వహించే ఈ కార్యక్రమం నిర్వహణ కోసం టీటీడీ అధికారులు పుష్కరిణిలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కొత్త నీటిని నింపి, వందశాతం క్లోరినేషన్ చేశారు. ప్రత్యేకంగా ఇనుప చైన్ లింక్ కంచెలు నిర్మించారు. వరాహస్వామి ఆలయం వద్ద పుష్కరిణిలో సుదర్శన చక్రతాళ్వార్ కు పుణ్యస్నానం చేసే ప్రాంతంలో ప్రత్యేక చక్రస్నానం చేసే ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులను ఉదయం 4గంటల నుంచి పుష్కరిణిలోకి అనుమతిస్తారు. భక్తులు రోజంతా పుణ్యస్నానాలు చేయవచ్చునని ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు. పుష్కరిణి వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. గజ ఈతగాళ్లను, అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసు, విజిలెన్స్ సిబ్బంది, శ్రీవారి సేవకులు సమన్వయం చేసుకుంటూ చక్రస్నానం సమయంలో అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈవో శ్యామలరావు సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :