Studio18 News - భక్తి / : Samalu Recipe : నవరాత్రుల్లో అమ్మవారికి తొమ్మిది రోజులు పూజలు చేసి ఉపవాసం ఉంటారు. ఉపవాస సమయంలో తినే ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటిస్తారు. ఉపవాస సమయంలో సామలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చిరు ధాన్యాల్లో ఒకటి సామలు. నవరాత్రి వేళ ఉపవాసం ఉండే భక్తులు ఆహారంలో సామలు ఎక్కువగా వాడతారు. సాధారణంగా సామలుతో కిచ్డీ తయారు చేసుకుని తినడానికి ఇష్టపడతారు. అయితే సామలు పులావ్ కూడా రుచికరంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో ఉపవాస సమయంలో అందాల్సిన పోషకాలు ఉంటాయి. ఇంతకీ సామల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? సామల పులావ్ ఎలా తయారు చేసుకుంటారు? ఉపవాస సమయంలో సామలు తీసుకోవడం వల్ల కడుపు తేలికగా ఉంటుంది. అంతేకాదు చాలా సులభంగా ఆహారం జీర్ణమవుతుంది. శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. సామలలో పోషకాలు ఉంటాయి. ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి ఉపవాస సమయంలో పోషణ అందిస్తాయి. సాధారణంగా సామలు కిచ్డీని అందరూ ఇష్టపడతారు. వీటితో పులావ్ కూడా చేసుకోవచ్చు. సామలు బాగా కడిగి వడగట్టాలి. పాన్‌లో కొంచెం నెయ్యి వేసి వేడి చేయాలి. దానిలో జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. వాటిలో సామల బియ్యాన్ని కూడా వేసి వేయించాలి. చిటికెడు రాక్ సాల్ట్ వేసి నీరు పోసి మరిగించాలి. పాన్ మూత పెట్టి 15 నుంచి 20 నిముషాలు బాగా ఉడకనివ్వాలి. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బంగాళా దుంపలు, వేరుశెనగ దానిలో యాడ్ చేయాలి. మరికొన్ని నిముషాలు వేడి చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా సామల పులావ్ సర్వ్ చేసుకోవడమే.
Admin
Studio18 News