Saturday, 14 December 2024 02:54:50 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

టెక్సాస్‌లో 90అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం.. దీని ప్రత్యేక ఏంటో తెలుసా?

Date : 21 August 2024 10:48 AM Views : 59

Studio18 News - భక్తి / : 90 Feat Hanuman Statue in USA : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్ నగరంలో 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈనెల 18న విగ్రహాన్ని ప్రారంభించారు. హోస్టన్ నగరంలోని అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో ఈ ఆంజయనే స్వామి 90 అడుగుల విగ్రహాన్ని స్థాపించారు. ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పేరు పెట్టారు. ముఖ్యఅతిథిగా చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. విగ్రహం ఆవిష్కరణ సమయంలో హెలికాప్టర్ తో విగ్రహంపై పూలవర్షం కురిపించారు. జై వీర హనుమాన్ నామస్మరణతో ఆ ప్రాంగణం మార్మోగింది. పెద్ద సంఖ్యలో అమెరికాలోని హిందువులు పాల్గొన్నారు. టెక్సాస్ లోని 90 అడుగుల హనుమంతుని విగ్రహం యూఎస్ లో ఓ ప్రత్యేక గుర్తింపు పొందింది. యూఎస్ వ్యాప్తంగా ఇది మూడవ ఎత్తయిన విగ్రహంగా నిలిచింది. అదేవిధంగా ఉత్తర అమెరికాలోని ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందింది. ఇదిలాఉంటే 2020లో డెలావేర్‌లో 25 అడుగుల హనుమంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విగ్రహం తెలంగాణలోని వరంగల్ నుండి రవాణా చేయబడింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :