Studio18 News - భక్తి / : నాగర్ కర్నూల్ పట్టణంలో రేపటి నుండి నిర్వహించనున్న శ్రీకృష్ణ ఆయుతచండీ హోమాన్ని విజయవంతం చేయాలని శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ భక్తులకు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ పట్టణంలో నీ ఓం నగర్ కాలనీ సమీపంలో యాగశాల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ అత్యంత వైభవోపేతంగా నేటినుండి 21వ తేదీ వరకు శ్రీకృష్ణ ఆయుతచండీ హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు 800 మంది వేద పండితులు హాజరై హోమలను నిర్వహిస్తారని రోజు 400 ల జంటలు పాల్గొని హోమం నిర్వహించేందుకు కార్యక్రమాలు రూపొందించినట్లు వెల్లడించారు.
Also Read : nagarkurnool : అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్ గా గార్లపాటి శ్రీనివాసులు
Admin
Studio18 News