Tuesday, 10 March 2026 02:10:12 PM
# శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ # హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా

Sarada Peetham : శ్రీ శారదా పీఠానికి నోటీసులు.. వారం రోజుల్లో కట్టడాలను తొలగించాలని ఆదేశాలు.. లేదంటే..

తొలగింపునకు అయ్యే వ్యయాన్ని మఠం నుంచే వసూలు చేస్తామని నోటీసుల్లో తెలిపింది జీవీఎంసీ.

Date : 25 March 2025 10:34 AM Views : 215

Studio18 News - భక్తి / : Sarada Peetham : చిన ముషిడివాడ శ్రీ శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ భూమిలో ఉన్న శాశ్వత కట్టడాలను వారంలోగా తొలగించాలని నోటీసుల్లో మఠం మేనేజర్ కు సూచించింది. మొత్తం 9 శాశ్వత కట్టడాలు, కొంత ఖాళీ స్థలం ప్రభుత్వ భూమిలో ఉన్నాయంటూ తెలిపిన జీవీఎంసీ.. 8వ జోనర్ కమిషనర్.. వారం రోజుల్లోగా కట్టడాలు తొలగించకుంటే తామే తొలగిస్తామంటూ నోటీసులు ఇచ్చారు. తొలగింపునకు అయ్యే వ్యయాన్ని మఠం నుంచే వసూలు చేస్తామని నోటీసుల్లో తెలిపింది జీవీఎంసీ. ఇక శారదా పీఠానికి పెందుర్తి ఎమ్మార్వో కూడా నోటీసులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో జరిగిన అనేక భూ వ్యవహారాలకు సంబంధించి ఫోకస్ పెట్టింది. గత వైసీపీ ప్రభుత్వం శారదా పీఠానికి భీమిలి ప్రాంతంలో కొన్ని ఎకరాల భూములు కేటాయించింది. ఆ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. తాజాగా చిన ముషిడివాడలో శారదా పీఠం మఠం నడుపుతోంది. స్వరూపానంద సరస్వతి ఈ పీఠానికి అధిపతిగా ఉన్నారు. ఆయన వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే చర్చ అప్పట్లో టీడీపీ, జనసేన ఆరోపించాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మఠంలో కొంత ప్రభుత్వ భూములను ఆక్రమించి భనవాలను నిర్మించారు అనే ఆరోపణలపై దృష్టి సారించారు. దీనిపై కొన్ని రోజులుగా అధికారులు, రెవెన్యూ సిబ్బంది, గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి సర్వే చేశారు. దాదాపు 22 సెంట్ల ప్రభుత్వ భూమిని మఠంలో ఆక్రమించారని, కట్డడాలు కట్టారని, మఠం ఆధీనంలో ఉందని నిర్ణారణకు వచ్చారు. ఈ మేరకు పెందుర్తి ఎమ్మార్వో శారదా పీఠానికి చెందిన మేనేజర్ కు నోటీసులు జారీ చేశారు. 22 సెంట్ల ప్రభుత్వ భూమి మఠం ఆధీనంలో ఉందని, వెంటనే ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ కట్టడాలను కూల్చేయాలని ఆదేశించారు.

లేదంటే తామే ఆ కట్టడాలను కూల్చివేస్తామని, కూల్చివేతలకు అయ్యే ఖర్చును కూడా వసూలు చేస్తామని హెచ్చరించారు. ఈ నోటీసులపై శారదా పీఠం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. నోటీసుల్లో ఇచ్చిన ప్రకారం శారదా పీఠం వాళ్లు నిర్మాణాలను కూల్చివేస్తారా? లేక అధికారులు కూల్చేసే పరిస్థితిని తెచ్చుకుంటారా? చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :