Studio18 News - TELANGANA / NIZAMABAD : ధర్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. మొత్తం 147 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా మంగళవారం నిర్వహించిన ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్-2 పరీక్షలకు 144 మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. ముగ్గురు విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు మినరల్ వాటర్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు.
Admin
Studio18 News