Monday, 16 March 2026 01:54:06 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు

Date : 08 March 2026 08:26 PM Views : 144

Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : వేములవాడలోని స్థానిక సిద్ధార్థ కాంప్లెక్స్ లాడ్జిలో జరిగిన భూక్య మోహన్ హత్య కేసును వేములవాడ పట్టణ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు బైరి శారద అలియాస్ కళ్యాణి, ఆమె భర్త బైరి శేకర్ మరియు సహకరించిన గుండం రవి అలియాస్ రవీందర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం, వేములవాడ అంజనీనగర్‌లో నర్సుగా పనిచేస్తున్న బైరి శారదకు మృతుడు భూక్య మోహన్‌తో అక్రమ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో మోహన్ తరచూ డబ్బులు కావాలని శారదను వేధించడమే కాకుండా, వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను బయటపెడతానని బెదిరించసాగాడు. ఈ వేధింపులు భరించలేక శారద తన భర్త శేకర్‌తో కలిసి మోహన్‌ను వదిలించుకోవాలని పథకం రచించింది. ఈ క్రమంలో గుండం రవి అనే వ్యక్తి సహాయం తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన శారద పథకం ప్రకారం మోహన్‌ను వేములవాడలోని సిద్ధార్థ కాంప్లెక్స్‌కు పిలిపించింది. అక్కడికి చేరుకున్న శేకర్, రవిలు కలిసి నైలాన్ తాడుతో మోహన్ గొంతు నులిమి హత్య చేశారు. నిందితుల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు తిప్పాపూర్ బస్ స్టాండ్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన బైక్, నైలాన్ తాడు మరియు చాకును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను పట్టుకున్న వేములవాడ టౌన్ సీఐ వీర ప్రసాద్, ఎస్ఐలు రామ్మోహన్, ప్రేమానందం, పిసిలు ఇమ్రాన్, సల్మాన్, శ్రీనివాస్‌లను వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందించారు.

వేములవాడలోని స్థానిక సిద్ధార్థ కాంప్లెక్స్ లాడ్జిలో జరిగిన భూక్య మోహన్ హత్య కేసును వేములవాడ పట్టణ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు బైరి శారద అలియాస్ కళ్యాణి, ఆమె భర్త బైరి శేకర్ మరియు సహకరించిన గుండం రవి అలియాస్ రవీందర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం, వేములవాడ అంజనీనగర్‌లో నర్సుగా పనిచేస్తున్న బైరి శారదకు మృతుడు భూక్య మోహన్‌తో అక్రమ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో మోహన్ తరచూ డబ్బులు కావాలని శారదను వేధించడమే కాకుండా, వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను బయటపెడతానని బెదిరించసాగాడు. ఈ వేధింపులు భరించలేక శారద తన భర్త శేకర్‌తో కలిసి మోహన్‌ను వదిలించుకోవాలని పథకం రచించింది. ఈ క్రమంలో గుండం రవి అనే వ్యక్తి సహాయం తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన శారద పథకం ప్రకారం మోహన్‌ను వేములవాడలోని సిద్ధార్థ కాంప్లెక్స్‌కు పిలిపించింది. అక్కడికి చేరుకున్న శేకర్, రవిలు కలిసి నైలాన్ తాడుతో మోహన్ గొంతు నులిమి హత్య చేశారు. నిందితుల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు తిప్పాపూర్ బస్ స్టాండ్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన బైక్, నైలాన్ తాడు మరియు చాకును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను పట్టుకున్న వేములవాడ టౌన్ సీఐ వీర ప్రసాద్, ఎస్ఐలు రామ్మోహన్, ప్రేమానందం, పిసిలు ఇమ్రాన్, సల్మాన్, శ్రీనివాస్‌లను వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.

Developed By :