Studio18 News - TELANGANA / RANGAREDDY : పదవ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు బీసీ సేన షాబాద్ మండల యువజన విభాగం అధ్యక్షులు బండ అజయ్ కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. కష్టపడి చదివిన ప్రతి విద్యార్థి తమ ప్రతిభను చాటుకొని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
Admin
Studio18 News