Studio18 News - TELANGANA / NIZAMABAD : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన బాలయ్య శుక్రవారం నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డా. ఆర్. భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం మండలంలోని పలు అంశాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. ఎటువంటి ఇబ్బందులకు తావులేకుండా సమర్థవంతంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్ఐ గంగాప్రసాద్ కూడా పాల్గొన్నారు
Admin
Studio18 News