Sunday, 29 March 2026 05:24:09 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Dil Raju: సినీ పరిశ్రమలోని సమస్యల పరిష్కారం కోసం దిల్ రాజు మాతో మాట్లాడుతుంటారు: మల్లు భట్టి విక్రమార్క

Date : 06 February 2026 07:15 PM Views : 26

Studio18 News - TELANGANA / HYDERABAD : సినీ రంగ అభివృద్ధిపై సలహాలు, సూచనలు ఇస్తుంటారన్న ఉప ముఖ్యమంత్రి టాలీవుడ్ ఎలాంటి సాయం కోరినా ప్రభుత్వం చేస్తుందని హామీ గద్దర్ అవార్డుల వేడుకను దిల్ రాజు బాధ్యతాయుతంగా తీసుకున్నారని వ్యాఖ్య చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారం కోసం ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్ దిల్ రాజు ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో మాట్లాడుతుంటారని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సినీ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా సలహాలు, సూచనలు ఇస్తుంటారని, అందుకు ఆయనను అభినందిస్తున్నానని అన్నారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టాలీవుడ్ ఎలాంటి సాయం కోరినా తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని హామీ ఇచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ను కేంద్రంగా చేయాలనేది తమ ప్రభుత్వం సంకల్పమని అన్నారు. ఈ మేరకు బ్లూప్రింట్ సిద్ధం చేశామని తెలిపారు. సినిమా రంగం ద్వారా సామాజిక సందేశాలు ఇవ్వడంతో పాటు వాణిజ్య పరంగా లబ్ధి పొందవచ్చని అన్నారు. చిత్ర పరిశ్రమ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని తెలిపారు. పరిశ్రమకు ఎలాంటి అవసరం వచ్చినా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రత్యేకంగా చెప్పమన్నారని తెలిపారు. వారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున వారి తరఫున చెబుతున్నానని అన్నారు. గద్దర్ అవార్డుల వేడుకను దిల్ రాజు ఓ బాధ్యతగా స్వీకరించారని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :