Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్ పాతబస్తీ ఉప్పర్ గూడ రామాలయంలో శ్రీ రామ భక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ కుమార్ ఖేరా, మదన్నపేట సీఐ ఆంజనేయులు మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా విచ్చేసి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నిరంజన్ యాదవ్, రాంపాల్ యాదవ్, పి.శ్రీనివాస్, ధనరాజ్, ప్రమోద్ ముదిరాజ్, పెద్ది యాదవ్, రాహుల్ కిషోర్ యాదవ్ పాల్గొన్నారు. వేదపండితులు, అర్చకులు, పూజారుల వేద మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో చేరి భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలో పాల్గొన్నారు.
Admin
Studio18 News